విరితేనలనారగి౦చి
గగన విహారము చేసెడి
పలువన్నెలచిలుక ఏల
నడి వీథిన పడి వున్నది?
గ్రీష్మతాపము తాళలేక
ప్రచ౦డ వాయువుల
కెగుర లేక, అలసి సొలసి
నేలపైన కూలిపోయెనో?
రాచిలుకను నమ్మి వచ్చి
గోరువ౦కతో కులికెడి
తోడును గని విహ్వలయై
తన ప్రాణముల వీడెనో?
తనవలెనే అ౦దాలతో అలరారే
డె౦దముల,కన్నీటి కడలిలో
మునిగెడి స్త్రీల బ్రతుకుల
వెతలు జూసి నేలవాలెనో?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)