20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఈ నిశీధి లోన

0 comments
ఈ నిశీధి లోన
మెరిసే తారక నీవేనా? 
పెనుతుఫాను లోన దారికి చుక్కాని నీవేనా

కమలము నడుమన విరసిల్లిన
లేనగవుల తల్లిని నీవేనా
కనుపాప లోన ఇమిడిన
అపరదేవత నీవేనా 

క్షోభములో ప్రశాంతతను
నెలకొల్పునది నీవేనా 
సమాధిలోని చిత్తములో
అంతరంగంలో 
మెదిలేది నీవేనా 

మనోనేత్రంలో మౌనముగా నెలకొన్న
మానస వీణియను మ్రోయించే భారతమాత నీవేగా, 
ధైర్య, స్థైర్యములొసగే కన్నతల్లి నీవే నా

అనురాగాల ప్రవాళీ

0 comments
హే హే హే
పాడవే పాడవే జావళీ 
అనురాగాల ప్రవాళీ

హే హే హే
సరాగాల భామల 
ఉత్తేజిత ఉన్మీలిత ప్రసూనావళీ

కలహంస నడలలో
కన్నియల కేకీరవంలో

అంద చందాలలో
విందు వినోదాలలో

పాడవే ప్రేమ గీతాలను! 
పొందవే హిమవత్ జలపాతాలను
సుమ సౌరభాలను, కిన్నెరసానివై! 
సాగిపో, నెమిలికన్నుల నెరజాణవై !