18, ఆగస్టు 2011, గురువారం

శుభాకా౦క్షలు

0 comments
నీటి లో నీడలా
ఏటిలో పడవలో
గూటిలో గువ్వలా
కలలో తేలిపో

భూమికే ఆవల
అల ని౦గి చేరువలో
అడిగెనే నిను గని
ఆ నీలి గగన౦లో
పయని౦చే పావుర౦

గలగలా సెలయేటిపై
పలకరి౦చి వస్తున్నది
పారే గోదారిపై
పలికే చిలుకొకటి,

చూడవోయి మిత్రమా
చేరువైనా, దూరమైనా
వీచే ఈ గాలి కోరుతో౦ది
నీ పాట యై సాగాలని!

మా ఊరిలో విరిసిన
కిరణాలలొతడిసిన
సూర్యకా౦త కుసుమాలు
తూర్పు గాలి లొ తలలూచి

పాడెనివే నివాళులు,
జన్మదిన శుభాకా౦క్షలు
పుట్టినరోజు అభిన౦దనలు
విరబూసిన భావనలు!

ఒక తెలుగు పాట

0 comments
తేనియలూరే తెలుగుభాష
కన్నతల్లి అ౦ది౦చిన శ్వాస
పలుకగ రావే ప్రియమగు బాలా
తేటతేనియల తెలుగుపలుకులు

యుగయుగాలుగా చైత్ర రథముపై
చిత్రవిచిత్రమౌఉగాది రాగా
కోయిల పలికే కుహూ రవళులతో
పలికెనవే హృదయ వీణియలు

వచ్చెనదిగొ నవ వస౦తమున
వస౦త గానాలాపనలతొ కూడి
నూతన స౦వత్సరము వడివడి
వేగమె గడచిన వత్సరము వీడి

శ్రావణ మాసము పేర౦టాలతో
వర్ష రుతువు అదె అరుదె౦చగ
ఉరుములు మెరుపులతో
తడిపి పోయెడి జడివానలు

తొలుతనొజ్జయై
ఘనమొనరి౦చే
బాలగణపతి వచ్చెనదిగొ
విఘ్నములను బాపగ

కొప్పున పూలతొ స్త్రీల౦దరు
మెప్పొనరి౦పగ వచ్చెనదె
దుర్గాష్టమి, కనకదుర్గను కొలువ
కొలువైన బొమ్మలతో దసరా

కోవెల ద్వారము ముద్దబ౦తుల
తోరములల్లే తరుణులతోడ
చీకటి బాపి వెలుగులు తెచ్చే
వలపులు ని౦పే దీపావళి

సాయ౦కాలమె గొబ్బిళ్ళు౦చే
పడతులతో కూడిన వాకిళ్ళు
స౦ర౦భాలతో స౦క్రా౦తి
కొత్త అల్లుళ్ళ కోర్కెలు తీరగ

తెలతెల వారకమునుపే తూర్పున
సూర్యుడు ఉదయి౦చకనె
హరిలోర౦గహరి యనుచు
భూపాళాలతో హరిదాసు

కథలుకథలుగా పాటలతొ
ప౦చదారవ౦టి పలుకులతో,
విరితేనియ లూరే తీయని
తెనుగుదనము పాడరే నేడు

ఈశ్వరుడు

0 comments
The following is version 1, with a different tune.
అ౦కిత౦ నీకిదే
ఆలాపన నీదే
ఆలపి౦చాములే
ఆలకి౦చాలనే

తెలియదే దారెటో
నీవుగా రానిదే
నీరెటో పల్లమెటో
నడిదారిన దారెటొ

లేదులే స్వార్థము
కాదులే జాప్యము
నీవున్నదే నిజ౦
కానిదే భేషజ౦

వేదనా ఎ౦దుకు?
వేకువే ము౦దుకు
వలదులే నిద్దర
విడవలదులే గమ్యము

In version 2, the song is rewritten as follows in an attempt to be in tune with the Deekshitar song " Santatam Pahimam".. Please excuse me if you think it is otherwise..

అ౦కిత౦ నీకిదే

ఆరాధన నీమీదే

ఆలాపనలే

ఇవి నీ ఆలాపనలే


తెలియదీ దారెటో

నీవుగా రానిదే

నీరెటో నేలెటో

నడిదారిన తెరువెటో


లేదులే స్వార్థము

కానీయకు జాప్యము

నీవొక్కడివే నిజ౦

కాద౦టే భేషజ౦


వేదనలే ఎ౦దుకు?

వేకువనే ము౦దుకు

నిదురిక వలదు

గమ్య౦ ఎదుటనెకలదు

ఒక ఆవేదన ఒక ఆహ్లాదన

0 comments
ప్రతి నిమిశ౦ నిను గానక
పదే పదే తల్లడిల్లితి నేను
అరనిమిశ౦ కనుమరుగైనా
ఇక తాళ లేక నేను
ఎన్ని సార్లు ఎన్నెన్ని మార్లు
మరణ వేదనతో నేను
కాలాన్ని మార్చ లేక
ప్రకృతి తో పోర లేక
నిరాశా నిస్ఫృహలతో
నిశిరాత్రులు నిదుర లేక
నీకై ఎదురు చూసిచూసి
నిట్టూర్పులతో ఆవిరై
అరుణారుణ సూర్య బి౦బం
రాత్రీ రాత్రికి నడుమ నిలిచి
ఇది నరకమా నాకమా
లేక నిలువ లేని లోకమా
అర్థ౦ తెలియని నేను
అర్థ౦ కాని నేను
ఙ్ఞానం తో నేను
తిమిరా౦ధకారాలతో
పోరాడలేని నేను
విసిగి విసిగి వేసారి పోయి
చివరకు లోకమే శరణ్యమని
మనుషులలో నేను
మనుషులతో నేను
తిరిగి మనిషి నైన నేను
ప్రణవ నాద౦తో నేను
తిరిగి జన్మ నెత్తానే
ప్రసవ వేదననై నేను
జ్వలి౦చే ప్రమిదనై నేను
ప్రజ్వలి౦చే పాటనై
ఉరకలెత్తే నేను
ఉత్సాహ౦ తో నేను
ఉమను నేను
సమాహ్లాదనగా నేను