అప్పుడు నేను
అప్పుడప్పుడే
రజస్వలనైనాను
రాత్రి చీకటి గదిలో ఒంటరిగా ఉంచి
ఆవల పడుకున్నారందరూ
ఆ చిమ్మచీకటిలో నాకు
ఊపిరి సలపలేదు
ఎప్పుడో అర్థరాత్రి
మెలుకువ వచ్చింది
ఉక్క పోస్తూ గదిలో
ఫంకా తిరగడం
మానేసింది, కరెంటు లేదేమో
అయిదు రోజులకి
ఇంట్లోకి వచ్చి,
ఇంకా లోపలే
ఉండాలంటే
ఊపిరాడలేదు
మేడమీదికి
నెమ్మదిగా, మెట్లెక్కి వెళ్ళాను
నిండుగా నవ్వుతున్న
ఆ నెలబాలుని చల్లదనం,
నేనలాగే నీళ్ళ టాంకు పై
వాలి తిలకిస్తున్నాను,
ఆ వెన్నెల్లో
ఆ చల్లదనం లో
నీలాకాశపుటందాలు చూస్తూ
లేత బంగారం లా
వెండి వెన్నెలలో మెరిసే
ఆ చంద్ర బింబం
చుట్టూరా చెల్లా చెదరుగా
పారేసుకున్న ముక్కుపుడకల్లా
ఛమక్ ఛమక్కున
మెరిసే చుక్కలు..
ఏ నర్తకి పాదాల మంజీరాలో
ఆ విడివడిన తారా సమూహాలు!
ఆ వెన్నెల వాగులో స్నానం చేస్తూ
ఆ వెన్నెట్లో పునీతురాలౌతూ,
అలా చూస్తూ ఎపుడో నిద్దరోయాను
ఎక్కడో స్వప్నలోకాల్లో విహరిస్తున్నాను,
చలిగాలికి చప్పున మెలుకువ వచ్చింది,
గభాల్న లేచాను
ఫంకా జోరుగా తిరుగుతుంది, ఇంకా..
కలలో మన్మధుడెవరూ లేరు
కేవలం ప్రకృతి, ఆమె ఒడిలో నేను...
అప్పుడప్పుడే
రజస్వలనైనాను
రాత్రి చీకటి గదిలో ఒంటరిగా ఉంచి
ఆవల పడుకున్నారందరూ
ఆ చిమ్మచీకటిలో నాకు
ఊపిరి సలపలేదు
ఎప్పుడో అర్థరాత్రి
మెలుకువ వచ్చింది
ఉక్క పోస్తూ గదిలో
ఫంకా తిరగడం
మానేసింది, కరెంటు లేదేమో
అయిదు రోజులకి
ఇంట్లోకి వచ్చి,
ఇంకా లోపలే
ఉండాలంటే
ఊపిరాడలేదు
మేడమీదికి
నెమ్మదిగా, మెట్లెక్కి వెళ్ళాను
నిండుగా నవ్వుతున్న
ఆ నెలబాలుని చల్లదనం,
నేనలాగే నీళ్ళ టాంకు పై
వాలి తిలకిస్తున్నాను,
ఆ వెన్నెల్లో
ఆ చల్లదనం లో
నీలాకాశపుటందాలు చూస్తూ
లేత బంగారం లా
వెండి వెన్నెలలో మెరిసే
ఆ చంద్ర బింబం
చుట్టూరా చెల్లా చెదరుగా
పారేసుకున్న ముక్కుపుడకల్లా
ఛమక్ ఛమక్కున
మెరిసే చుక్కలు..
ఏ నర్తకి పాదాల మంజీరాలో
ఆ విడివడిన తారా సమూహాలు!
ఆ వెన్నెల వాగులో స్నానం చేస్తూ
ఆ వెన్నెట్లో పునీతురాలౌతూ,
అలా చూస్తూ ఎపుడో నిద్దరోయాను
ఎక్కడో స్వప్నలోకాల్లో విహరిస్తున్నాను,
చలిగాలికి చప్పున మెలుకువ వచ్చింది,
గభాల్న లేచాను
ఫంకా జోరుగా తిరుగుతుంది, ఇంకా..
కలలో మన్మధుడెవరూ లేరు
కేవలం ప్రకృతి, ఆమె ఒడిలో నేను...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి