పాడి పంటలు దండిగా
పండినపుడే సేద్యమోయి
కష్టజీవికి కడుపు నిండా
భుక్తి కలిగితే పండగోయి
ఆస్త్ర శస్త్ర జాలములతో
పాల్గొనిన కాని దేశ రక్షణ
నెలకు మూడు వానలు
కురిసినపుడె జాతి జీవన
మేలుమేలని ప్రణాలికలు
వేలు వేలు ఏర్పరిచినను,
పూనుకొని జాతిని జాగృతి
పరచినపుడే కదా ధీరత?
నీవు గొప్పా నేనుగొప్పా యని
మేడలెన్నో గూడు కట్టిన,
లేవు నీవు, సంస్కృతిని వీడిన
దాడులెన్నియో నీవు గెలిచిన
భూములెవరివో స్వామ్యమెవరో
కష్టమెవరో ఎవరికెరుక
కూడు, గుడ్డా, నీరు నీడయు
బడుగు జనముకు దిక్కేలేక
దేశమేలే నాయకులు
కుల మతాలను రథాశ్వాలు
విద్వేశాలను రగిలిస్తున్న
భవిత ఏది, బ్రతుకు ఏది
జన గణాలు వన మృగాలై
దేశమంతా దాడిచేసిన
నేల ఏది? నీడ ఏది?
తావు ఏదీ తెన్ను ఏది?
తస్మాత్ జాగ్రత్త, చెప్పు వారలు
ఉందురా ఈ యుర్వి యందున..
జాగృతమై ఉన్ననాడే
దేశ భవిత, భవ్య చరిత..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి