అందమైన సాయంకాలం, నీలి మబ్బులు ఆకాసం నిండా, సముద్ర తీరాన్నానుకుని ఇల్లు. ఇంటి వెనక రాతి అరుగు, నీటి అలలను తాకుతూ, ఒక వైపు తీరాన బంగారు వర్ణంలో ఇసక, నీటి మీదుగా దూరంగా తెరచాప ఎత్తి ప్రయాణం చేస్తున్న పడవలు.
ఆ వాతావరణ౦లో చేతిలో
కలంపట్టుకుని రాతి అరుగు పై కూర్చుని ఆలోచిస్తున్న ఆమె.
ఇంతలో అతను, నాగార్జున లా
ఉన్నాడు (కాని కాడు!)..(ఔనా?!), చక్కటి పొడువరి! దగ్గరగా వచ్చాడు, పక్కనే ఆనుకుని
కూర్చున్నాడు,
“ఏంచేస్తున్నావిలా ఒంటరిగా?”
అడిగాడు అతను..
“ఆకాశంలో నీలి మేఘాలను చూస్తూ,
నిన్న ఇంటికెడుతుంటే కారులో, ఇలాంటి నీలి మేఘాలు ఆకాశం నిండా వ్యాపించాయి కదా, అది..”
అతను వంగి ఆమె పెదవులను స్వాదిస్తున్నాడు, ఒక చేత్తో ఆమెను పొదివి పట్టుకుని, మరో చేత్తో ఆమె అందాలను
చేత్తో తీయని నొక్కులతో స్పర్షా ఆనందాన్ని ఆస్వాదిస్తూ..
“.. చూస్తుంటే నీవే గుర్తొచ్చావు.”
అంది ఆమె పెదాలను చుంబన బంధం నుండి ఇంకా బయటికి తీయకు౦డానే..
ఝల్లుమంది అతని హృదయం, మరింతగా పొదివిపట్టుకుని, రెండు చేతులతో కౌగిలించుకుని ఆమె కళ్ళలోని తమకాన్ని చూస్తూ మరింత గాడాలింగనంలో వాళ్ళిద్దరూ..
ఝల్లుమంది అతని హృదయం, మరింతగా పొదివిపట్టుకుని, రెండు చేతులతో కౌగిలించుకుని ఆమె కళ్ళలోని తమకాన్ని చూస్తూ మరింత గాడాలింగనంలో వాళ్ళిద్దరూ..
ఆ నల్లని ఆకాశం, మేఘావృతమై,
వొంగి నీలి సముద్రాన్ని ఎక్కడ చుంబిస్తుందో, ఎక్కడ సముద్రం ఆగిపోయిందో ఎక్కడ నింగి
వంగి కడలిని ముద్దాడుతుందో కనుగొనలేని కలయిక అల్లంత దూరాన నుండి భూమ్యాకాశాల కలయిక
చూస్తుంటే వారి పరిష్వంగంలా తోస్తుంది..
..
*** *** ***
చప్పున కళ్ళు తెరిచింది
ఆమె.
చుట్టూరా చీకటి, బెడ్ లైట్
కాంతి గది నిండా మసకగా వ్యాపించి ఉంది.
పక్కనే, గోడ వైపు తిరిగి
నిదరపోతున్న భర్తని చూసింది, పెదవులపై చిరునవ్వు మెరిసి, గోముగా దగ్గరకు జరిగింది.
“ఇటు తిరుగవూ ఒక సారి?”
అని...
ఇటు తిరిగిన భర్తతో, “ఏం కల
వచ్చిందని అడగవూ..” అంది
“తెల్లారేక అడుగుతాన్లే,
ఇప్పుడు నన్ను పడుకోనియ్యి, జరుగు” అని నిద్రలోకి జారుకున్నాడతను..
*** *******
"అంటావా మళ్ళా?" అడిగాడు అతను.
నవ్వాపుకుంటుంది ఆమె, "ఏదీ నేననందే! ఏదో రాసానంతే, ఉబుసుపోక!" ముందురోజు కథ రాసి అందరికీ ఫేస్బుక్లో పెట్టటం గుర్తుంచుకుని!
"మళ్ళీ చెప్పు?"
"ఐ.. .."ఆపై మాటలు అననివ్వలేదతను..
ఆపై మాటలు అవసరం లేదు కూడా!
"అలా రా దారికి!"
అరగ౦ట ఆలస్యంగా, ఆఫీసుకు బయల్దేరాడతను!
*** *******
"అంటావా మళ్ళా?" అడిగాడు అతను.
నవ్వాపుకుంటుంది ఆమె, "ఏదీ నేననందే! ఏదో రాసానంతే, ఉబుసుపోక!" ముందురోజు కథ రాసి అందరికీ ఫేస్బుక్లో పెట్టటం గుర్తుంచుకుని!
"మళ్ళీ చెప్పు?"
"ఐ.. .."ఆపై మాటలు అననివ్వలేదతను..
ఆపై మాటలు అవసరం లేదు కూడా!
"అలా రా దారికి!"
అరగ౦ట ఆలస్యంగా, ఆఫీసుకు బయల్దేరాడతను!
*** ***. ***. ***
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి