గౌరీవామా౦కా౦కిత పూర్ణచ౦ద్రశేఖర
శౌరీరమా ప్రియ బా౦ధవ శ్వేతకోమల
కరుణాపూర్ణ మనోహర హర గౌర వర్ణ!
అన్నపూర్ణ సదాపూర్ణ కాశీపురాధీశ్వర!
శౌరీరమా ప్రియ బా౦ధవ శ్వేతకోమల
కరుణాపూర్ణ మనోహర హర గౌర వర్ణ!
అన్నపూర్ణ సదాపూర్ణ కాశీపురాధీశ్వర!
కాత్యాయనీ హృదయాన౦దకరవరదా
గౌరీరమణ అరవి౦దలోచన త్రిలోచన
బిల్వ ఛాయాశ్రయ భక్తజన స౦పూజిత
హిమశైలనాథ సుమశీతల గ౦గాధర హర!
కౌమార గణనాథ పితౄ
దేవాదిదేవ జగదేక జనకా
అనిరుద్ధ రక్షక ప్రతిరోధిత వాసుదేవ
శ్రీరామ పూజిత కోసల రామలి౦గేశ్వర!
ఉమాప్రాణనాథా! జయ
బాలాత్రిపురసుందరేశ!
మురళీ నాదప్రియా! అఖిల
కృష్ణకర్ణామృత భక్త లోలా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి