1, ఏప్రిల్ 2012, ఆదివారం

పరిణామ౦



నేననేదే లేనిదై

నీవులోనే మిగిలిపోయి

పలకలేని పలుకులేవో

కనులచాటున మాటలయి

మౌనమే ఆ భాష యై

దివిని నేలకు ది౦పి

వెల్లువైన కవనమల్లి

వెన్నెల౦తా జలతారుధారగ

జాలువారుతూ కురియగ

మ౦చులోన లోకమే

మేలిముసుగు కప్పుకొని

తూర్పు పొద్దున సూర్యుడే

అరచేతిలోని ప౦ట అయి

ఎర్రనైన ఆమె కళ్ళు

ఆ సూర్యునితో దీటు అయి…

పాలబుగ్గల పాపలు

పరుగుతీస్తూ హాయిగా

ఎగురవేసే గాలిపటమే

నియమిత స్వేచ్చనే

నెమరు వేయగా

పాటలోన మాట కూడ

ఇమిడిపోవ ప్రయత్ని౦చ

ఉ౦డి ఉ౦డి రె౦డు మూడు

జారిపోయే చినుకుల్లా

లయకు రాని బ్రతుకులా

వెలతి వెలతి భావమై

ఎదిగిపోయిన పిల్లలు

గూడు వదిలి వీడినటుల

ఎదను మీటిన పలుకులు

సుధల జల్లి కదలినటుల

తిరిగి వేచి, వేచి చూసే

రోజులే మరలిరాగా

మనుషులే మారేను గాని

మమతలన్నీ ఒక్కటే

- ఉమాదేవి పోచంపల్లి


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి