26, మే 2016, గురువారం

పాలవెలుగుల తల్లి


పాలవెలుగుల తల్లి
అరుదెంచెనే!
పరువంపు జలతారు
పట్టుచీరలు దాల్చి
పొంగారు రంగారు
జిలుగు నవ్వుల తోడ
పాల వెలుగుల తల్లి
అరుదెంచెనే!

కరిమబ్బు లో నుండి
తెలివెలుగులు చిందుచు,
ఏటిపై వికసించు
ఎర్రాని తామరలో బంగారు
మాయమ్మ, సిరులిచ్చు తల్లీ
నీలమేఘశ్యాము
నీడలో తానుండి
పాలవెలుగుల తల్లి
అరుదెంచెనే!0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి