ఓ నా
అమేయ కవితా ఝరీ
సుమ
శీతల హిమ శైల శిఖరోత్పన్న
రమ్య భావనా
పద గంగాఝరీ
హిమవన్నగ
సాన్ద్ర సౌందర్య ప్రాభవీ
నీ ఒడిదుడుకుల
కలికి నడకల
నడల కానలకవతల
విషమయ
తూణీరాంచిత
పదజావళుల
దుందుభీ
నినాదాలకవతల
వికటిస్తూ,
కటిసీమ నుండి
సమస్థాకాశానికీ
తలదన్నేలా
పదాల
పాదాలను ఝళిపిస్తూ
వస్తున్న
ఆమ్లోదర భాస్వర
భాష్పాలను
సైతం ఆవిరి గావించే
భావనాతీత
బ్రతుకు బాటలో
భారాన్ని
మోయలేక మోస్తున్న మనిషి,
అంతులేని
ఆనందాలని పంచి
కష్టాలలో
నుండి, కలతలలో పండి
సారాన్ని
కోల్పోయిన సగటు సంసారజీవీ!
ఓ కవీ,
రవీ సుకవీ! రవీంద్ర కవీంద్రుని
మించిన
నీ కవితల భావోధృతాలని
కుసుమించిన
మానస సరోవరంలో
ప్రభవించిన
సూర్యకాంతిలోని
ప్రజ్వలిత
మయూఖమేఖలలో
వికసించిన
విమల రుధిర
రాగరంజిత
పరాగ కాంతిని
ప్రకటిస్తున్న కమల కోమల
కుసుమ
గర్భాలయంలో
తీయ
తేనియల మాధుర్యంలో
మైమరచి
పరిభ్రమణ చేస్తూ
పరిభ్రమిస్తూ,
భ్రమర విన్యాసం చేస్తూ
మరిక
బయటికి రాలేక, లోలోన
కూరుకుపోతూ
కొట్టుమిట్టాడుతున్న
విహ్వల
భ్రమరం రీతి
సుమ
శీతల వాయువులో
తుషార
సరోవరంలో
నిస్త్రాణతతో
నీరసించి
ఇక రాలేను
మరి ఓ నేస్తం
అని కళ్ళతోనే
సెలవా మరి
అని
వీడుకోలో వేడికోలో తెలియని
ఒక
ఉన్మత్త మానస స్థితిలో
నిష్క్రమించి
మహాప్రస్థానానికై
ప్రస్థానం
అవుతున్న ఓ ప్రవాస నివాసీ
మహా మనీషీ!
నీ మమేక
నమో
వాకములెవరికోయి
ఏ
తీరమునకై నవనవోన్మేషిత
తదేక
దృగంచలాలను
సారిస్తున్నావు
ఆత్మా?
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి