ఇది ఒక ప్రయత్నం
అప్రయత్నంగా…
దిగంతాలకవతల
తేజోమయ జగతిలోకి
తలాతలాలకవతల
కవితాలతల ప్రపంచంలోకి
విలసిత సుమసౌరభాల
భావనామయ జగత్తులోకి
మణిమయమంజీర కదంబ
వనవాసినికై, కోటికోటి
కోరికలను తృణీకరించి
పరిమళించే కలువపూవుల
చిలకరి తెమ్మెరకై తపించే
సహృదయ స్నేహసుధామధుర
గాన రవళికోసం, ఓంకార
ఘోషిత ఝంకార నాదం కోసం
మనిషిలోని మానవత్వం కోసం
ఒక సగటు మనిషి అన్వేషణ..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి