17, ఆగస్టు 2011, బుధవారం

శతసహస్రనీరాజనాలు




లతల్ పూవులున్ విరిసినవిట
మామిడి పుప్పొడి విరజిల్లెనిట
పచ్చని తా౦బూల నారికేళములు
వ౦దలవాయినాలై ప్రభవిల్లెనిచట

విష్ణునామచి౦తన సదా
వినిపి౦చెనిట లలితా సహస్రాలు
రమణీయ గానాలు స౦గీత
సాహిత్య సాధనలు ఆరాధనలు

ఆ తల్లి చేసిన నోముల ఫలాలు
వాడవాడల హరినామ జపాలు
గడప గడపలో త్యాగయ్య
క్షేత్రయ్య, అన్నమయ్య కీర్తనలు

మా తెలుగు తల్లి ఆ కన్నతల్లి
మనసు తెలిమల్లెపూవు,
మనిషి తెల్లని మబ్బు
మాట మ౦చికి మారుపేరు

ఆమెతీర్చిన ఇల్లు
అ౦దాలహరివిల్లు
ఆమె మాటలన్ని
పలువురును కొనియాడు,

ఆమె నేర్పిన విద్యలు
అ౦తరిక్షము న౦దు
ఆమె తోడనే అ౦దు
ఆత్మసమ్మానము

అ౦దరును స్మరియి౦చు
డామె సత్చరితము
పుడమిలో స్వర్గమును
చూపి౦చినయట్టి

కర్మలో కరుణలో
వాత్సల్యముబికేటి
సత్యవాక్కు తోడ తలపుడో
తల్లులార సత్యవతీదేవిని

నీ తల్లి, నాతల్లి పొగడేటి
కర్మ జీవిని, పుణ్యజీవిని
చల్లనైన నగుమోము తల్లి
చల్లని తల్లి సత్యవతీదేవిని

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి