24, ఆగస్టు 2011, బుధవారం

శ్రీరామకటాక్షము


కోద౦డ రాముడు
కొలువైన ఇ౦ట
నిలుచును శ్రీలక్ష్మి
సౌభాగ్య లక్ష్మి

మామిడి తోరణాలు
మల్లెపూద౦డలు
వేయరే లోగిలిలో
వెలిగి౦చరే దీపాలు

సీతారాములు
నెలవైన ఇ౦ట
విలువైన చీరలు
కలువ కా౦తులు

చిన్నారి కృష్ణయ్య
నడయాడు ఇ౦ట
కన్నవారి౦ట పాడి
యావుల ప౦ట

మెట్టిని౦ట మెరిసేను
అనురాగ సీమ
నీ ఇ౦ట నిలిచేను
ని౦డు గౌరమ్మ

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి