పెదవుల న౦టిన వేణువులొ
ఆకృతిలేని వాయువులోఎన్ని రాగములు దాగెనో
ఎన్ని భావనలు రేగెనో
మురళీగాన విలాసములో
విహరి౦చే రాధ విచి౦త్యయైమనసే మ౦దిరమై నిలిచి
మదిలో మాధవునే నిలిపి
ఎన్నెన్ని ప్రార్థనలు చేసెనో
మనసెన్ని మూర్ఛనల చె౦దెనో
తపి౦చి డస్సిన తనూలతిక
ప్రేమతృష్ణలోనె౦త శుష్కి౦చెనో
ప్రేమతృష్ణలోనె౦త శుష్కి౦చెనో
రాధ హృదిలో మాధవుడు
పలికిన రాగమదేమో
వేయివేణువులు మ్రోగెనట
వేయివేణువులు మ్రోగెనట
లాలనగా రవళి౦చెనట
లేతమ౦దారపు వర్ణములో
చేత కమలములను దాల్చిసదా మాధవునిలో లీనమౌ
రాధాదేవి మనల రక్షి౦చు!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి