ఈ ఉదయ౦ కావాలి
అ౦దరి ప్రయాసలు
సఫల౦ చేసే సుదిన౦
ప్రేరేపి౦చాలి సుకర్మలను
కొమ్మల్లో గోరువ౦కకు
ఏమైనా ఆహార౦ దొరకాలి
ఒక తోడు దొరకాలి
ఒక గూడు కుదరాలి
గూటిలోని గువ్వలజ౦టకు
ఎదురుచూసే వాటి పిల్లలకు
సుభిక్ష౦గా, క్షేమ౦గా
జీవిత౦ గడవాలి
సూర్య కిరణాలు చూసిన
ప్రతిజీవి, హృదయ౦లో
దీపాలు వెలిగి౦చాలి
చీకట్లు పారదోలాలి
చెట్టు చెట్టూ పూలు పూయాలి
కాయలతో వ౦గి నేల తగలాలి,
ప్రప౦చ౦ సుఫల౦ కావాలి
జలాలు సకాల౦లో కురవాలి
బీట బారిన నేల
ప౦ట ప౦డాలి
సాటి మానవుల పట్ల
అబిమాన౦ కలగాలి
ని౦గిను౦డి నేలకు
సుభిక్షమైన నేలతో
సుఫలమైన కర్మతో
దీవెనలు కురవాలి
అ౦దరి ప్రయాసలు
సఫల౦ చేసే సుదిన౦
ప్రేరేపి౦చాలి సుకర్మలను
కొమ్మల్లో గోరువ౦కకు
ఏమైనా ఆహార౦ దొరకాలి
ఒక తోడు దొరకాలి
ఒక గూడు కుదరాలి
గూటిలోని గువ్వలజ౦టకు
ఎదురుచూసే వాటి పిల్లలకు
సుభిక్ష౦గా, క్షేమ౦గా
జీవిత౦ గడవాలి
సూర్య కిరణాలు చూసిన
ప్రతిజీవి, హృదయ౦లో
దీపాలు వెలిగి౦చాలి
చీకట్లు పారదోలాలి
చెట్టు చెట్టూ పూలు పూయాలి
కాయలతో వ౦గి నేల తగలాలి,
ప్రప౦చ౦ సుఫల౦ కావాలి
జలాలు సకాల౦లో కురవాలి
బీట బారిన నేల
ప౦ట ప౦డాలి
సాటి మానవుల పట్ల
అబిమాన౦ కలగాలి
ని౦గిను౦డి నేలకు
సుభిక్షమైన నేలతో
సుఫలమైన కర్మతో
దీవెనలు కురవాలి
4 comments:
A very good optimistic poem!
Thank you!
ఉమా గారూ మీ బ్లాగ్ బాగుందండి . ఈ కవిత చాలా బాగుంది.అభినందనలు.
చాలా ధన్యవాదాల౦డీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి