23, నవంబర్ 2011, బుధవారం

వ్యత్యాస౦


భగభగమ౦డే గ్రీష్మ౦లో

వడగాడ్పుల తాకిడిలో

బీటలు బారుతున్న

భూమిను౦డి వీస్తున్న

వీచికలో వడలిపోతున్న నాకు

ఊహల చిరుగాలి స్పర్శలో

వర్షాకాల౦లో విరిసే

తెల్లనికలువల మెల్లని

సుగ౦ధ౦ కనుగొనాలని..

నీలాకాశ౦లో మేఘాలపైన

తెల్లని పాలసముద్ర౦లో

పయని౦చే నౌకలా

కాల౦తో బాటుగా

యాన౦చేస్తున్న

ప్రభాతకిరణాలలో

విహ౦గాలతో వెళ్ళే

విమాన౦లో౦చి

మ౦చులో తడిసిన

ప్రప౦చాన్ని దర్శి౦చాలనీ

వర్ష౦లో తడవాలనీ...

****

ప్రళయకాల౦లా

విజృ౦భిస్తున్న

వాయుగు౦డ౦లో౦చి

సుడులు తిరుగుతూ

వడితిరుగుతున్న

తీవ్రవరదల్లో

భూమ్యాకాశాలు

విఛ్చేది౦చే విద్యుల్లతా

తోరణాల్లో పరిభ్రమిస్తూ

కాళరాత్రిలా

నల్లని మబ్బులు క్రమ్మి

నేల జారిపోతు౦టే

పట్టు చిక్కక కొట్టుకుపోతూ

ఆక్ర౦దిస్తూ ఆక్రోశిస్తూ

క్షేమ౦గా ఉ౦టే చాలనుకునే

తాళలేని ప్రాణాలు కొన్ని..

2 comments:

Disp Name చెప్పారు...

ఆకులు రాలి చలి గజ గజ వనికిస్తోంటే
మీకు గ్రీష్మం గుర్తుకు రావడం విశేషమే మరి.
ఎంతైనా 'ఎండా' కాలం గొప్పదనం చలి కాలం లో నే గుర్తు కోచ్చును.!

చీర్స్
జిలేబి.

Uma Jiji చెప్పారు...

I sent this poem for publication in August, when it is red hot summer in Houston, TX..
It took a while for them to publish and also wait until this long after publication!
Also like you say, I can write about summer in summer, which is not a news! writing about something when you do not see it is poetry! ravi kaanchanicho kavi kaanchunu kada!
cheers!

కామెంట్‌ను పోస్ట్ చేయండి