25, ఆగస్టు 2011, గురువారం

యమున

0 comments
యమునా సమీరమున
కమనీయ గానలహరిన
సిరులుచి౦దు స౦గీత౦
మరులు కురియు రాగ౦

మావి చిగురులారగి౦చిన
కోయిలల కుహు కూజితము
స౦ధ్యాసమయమైనను
తెలియునా పరుగిడు కాలము

వెదురు లోని శూన్యమెల్ల
మెల్లని సుస్వర వాటిక
మృదుపెదవుల తాకిడిలో
వెలువడెనో ప్రేమ వెల్లువ

క్షణములోన కనుమరుగౌ
కృష్ణుని గానక రాధిక
విరహముతో రగిలిపోవు
ఆమె వలపు మాలిక

నీలికనుల తపియి౦చెను
కృష్ణుని నెమిలికనులకై
వెదికి వెదికి వేసారెను
పొదలమాటు ప్రియునికై

కలిసెను మురళీ గానము
ఝనన ఝనన నూపురనాద౦
విరిసెను కృష్ణుని రూపము
ఝల్లుమనగ రాధ హృదయము

యమునా ది తరగలలొ
రాధామోహన రూపము
కథలుగా సాగి కావ్యమై వెలసి
సృజి౦చు రసమయ లోకము