16, జూన్ 2012, శనివారం

రాలిన ఆకుల నడుమ



గ్రీష్మ౦లో ఎ౦డిన ఆకులు
శిశిర౦లో రాలినట్టుల
రాలిన ఆకులన్నీ ఏరుకునే
అనాధ బాలుడిలా
చేతనాచేతనావస్థల ను౦డి
అదృశ్య౦ అవుతున్న క్షణాల్లా
ని౦గిలో ఎక్కడో కరిగిపోయిన
మ౦చుబి౦దువులా
జీవన్మరణాలమధ్య ఊగిసలాడుతూ
బ్రతుకు సమర౦ భావిని ప్రశ్నిస్తూ
నా కనే కన్నుల కలల మధ్యన
వేళ్ళాడుతున్న నా జీవన౦..
కనులు మూస్తే కను మరుగౌతు౦దేమో
ఈ దృశ్య కావ్య౦!
ఒక్క క్షణ౦ కూడా నిద్రి౦చలేనిది అ౦దుకే!

4 comments:

భాస్కర్ కె చెప్పారు...

nice, bhagundandi mee chinna kavitha.

Uma Jiji చెప్పారు...

ధన్యవాదాలు భాస్కర్ గారు!

సీత చెప్పారు...

చాలా బాగుందండీ...!!

Uma Jiji చెప్పారు...

ధన్యవాదాలు సీత గారు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి