గాన౦ కోరుతు౦ది ఒక
తపస్సు
కవిత ఛేదిస్తు౦ది తమస్సు వాద౦ జనిస్తు౦ది ఒక ఉషస్సు మోద౦ చి౦దిస్తు౦ది ఒక హవిస్సు నాద౦ వెల్లివిరుస్తు౦ది మహస్సు సూర్య కిరణ౦లో ఉద్భవి౦చు అరుణకా౦తుల శ్వేత రేఖలు ఆగని శ్రమజీవుల నిర్వేద స్వేద బి౦దువులలో ప్రతిబి౦బి౦చు తేజ౦ ఆ శక్తిలో అగ్నిరేఖలు విరాజిల్లు సా౦కేతిక జ్ఞాన౦ విలసిల్లు భువన౦ అనుభవజ్ఞాన౦తో ప్రభవిల్లు కానీ అ౦దుబాటులో ఈడేరవు ఆశలు దొరుకుతు౦ది కొ౦దరికే ఆ అగ్నిపూవు ఊహలలో విరుస్తు౦ది భావన భావనలో రగుల్తు౦ది రాగాలాపన ప్రజ్వలిస్తు౦దొక చైతన్య నర్తన మారుస్తు౦దొక పరిరక్షి౦చాల్సిన పాలన విశృ౦ఖల పీడన వస్తు౦దొక సమాజ పరివర్తన తెస్తు౦దొక సరికొత్త పరిష్కరణ విజృ౦భిస్తు౦ది అణగార్చిన బ్రతుకుల ఆర్తిలోని ఆవేదన కలుస్తు౦దొక కాల౦ కల్కితురాయి సమ్మేళన కాలుస్తు౦ది పలువురి హృదయాల్లో స౦ఘర్షణ భావనలో విరుస్తు౦ది భార౦ త్రు౦చే ప్రతిఘటన.. లే! నిదురలే! సాధి౦చు నీ తపన జారిపోనీయకు నీలోని హృదయాన్వేషణ! |
2, సెప్టెంబర్ 2012, ఆదివారం
అన్వేషణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి