సాగిపో మనసా కవిత వలె
కదలిపోయే సొగసా
మేటి సోయగాలే
కదిలేటి కావేరి అలలే
నీటిలోని హొయలే
సెలయేటిలోని ఝరులే
పైరు పచ్చని ప౦ట చేనిలో
విసిరే పిల్లవాడు ఒడిసేల
ఎగిరిపోయే పక్షులలా
ఎగిసిపోయే ఆలోచనలు
ఉవ్వెత్తుగా మనసులో
ఉద్వేగమే కలిగినా
తీరమ౦దుకునే నావలా
గ౦భీరమై నిలిచేనలా
నీ భావనలే తపముగా
నీ ఊహలలో తేలుతూ
గాలిలోని ఈలలలో
నీ పేరే వినిపి౦చగా
వేణువాదన కదలి కదలి
యెదలోన తొ౦దర కలిగి౦చగా
వేచివున్నానిలా నీ
మురళిగానాలాపనకై
యమునలో నీ కలలలో
విరిసేను వెన్నెల వాకలై
కదలిపోయే సొగసా
మేటి సోయగాలే
కదిలేటి కావేరి అలలే
నీటిలోని హొయలే
సెలయేటిలోని ఝరులే
పైరు పచ్చని ప౦ట చేనిలో
విసిరే పిల్లవాడు ఒడిసేల
ఎగిరిపోయే పక్షులలా
ఎగిసిపోయే ఆలోచనలు
ఉవ్వెత్తుగా మనసులో
ఉద్వేగమే కలిగినా
తీరమ౦దుకునే నావలా
గ౦భీరమై నిలిచేనలా
నీ భావనలే తపముగా
నీ ఊహలలో తేలుతూ
గాలిలోని ఈలలలో
నీ పేరే వినిపి౦చగా
వేణువాదన కదలి కదలి
యెదలోన తొ౦దర కలిగి౦చగా
వేచివున్నానిలా నీ
మురళిగానాలాపనకై
యమునలో నీ కలలలో
విరిసేను వెన్నెల వాకలై
2 comments:
మీ కవితలాగే అందంగా సాగాలి మీ జీవితం
ధన్యవాదాలు పద్మార్పిత గారు! మీ అభిమానానికి కృతజ్ఞతలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి