తుది మెరుగులు దిద్దుతూ
చెరిగిన తిలకం సరి చేస్తూ, వేస్తున్నబొమ్మలకు మెరుగులు దిద్దుతూ,
రంగూ రూపం మెరుపు కూర్పూ
సరిగ్గా వచ్చిందా అని చూస్తూ,
రంగుల పాళ్ళను రంగరిస్తూ,
ఆకాశ హర్మ్యాల్లోంచి ఊహలలోకి
వర్ణాలన్నిటినీ అరువు తెచ్చుకుంటూ
అరువుతెచ్చుకున్న రంగులు
కరువు తీరా మెరుగులు దిద్దుతూ,
రచిస్తున్నాను నా ఊహా చిత్రాన్ని
కాని కుంచెకి రంగు అద్దటం లేదు
రంగులద్దిన మరుక్షణమే,
చీకటిలోకి జారిపోతుంది,
కారుమేఘం లా ముసురుతూ
చిత్రం అంతా అల్లుకు పోతుంది,
ఆకారం లేని ఆకృతి ఏదో
కను చాటున తరలి పోతుంది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి