ఈ నిశ్చల నీరవ నిశాంతం లో
నీ వేణువు నూదుమా కృష్ణా!
ఆ రమ్య రసమయ నాదంలో
తేలి నడచి వచ్చే గానామృత
రవళిలో నా హృదయాన
జనింపజేసే రాగ మధురిమలు
ప్రతిధ్వనించును ఆ పరవళ్ళ
యమునా నదీ తరంగాలను!
నీ నీడలోన నడయాడి
నీ జాడలలో పల్లవించి
ప్రవహించే యమునా నదిలో
తేలిపోవు పూలనావలో,
రసరాగ మాధుర్యాలందించు
నీ అధరామృతాలను సొక్కిన
వెదురు కొమ్మ కారాదా
నా ఉనికి, నీ తీయని పాటగా మారి
తరియించరాదా ?
నీకై సదా తృష్ణతో నిలిచిన
ఈ భక్తురాలి ఆవేదనలు
కారాదా వెదురుపై గాయాలు
సుస్వర ఝరి నందిస్తూ
జీవన సాఫల్యాముగా
ఈ నీరస హృదయవేదన దూరం చేస్తూ...
నీ వేణువు నూదుమా కృష్ణా!
ఆ రమ్య రసమయ నాదంలో
తేలి నడచి వచ్చే గానామృత
రవళిలో నా హృదయాన
జనింపజేసే రాగ మధురిమలు
ప్రతిధ్వనించును ఆ పరవళ్ళ
యమునా నదీ తరంగాలను!
నీ నీడలోన నడయాడి
నీ జాడలలో పల్లవించి
ప్రవహించే యమునా నదిలో
తేలిపోవు పూలనావలో,
రసరాగ మాధుర్యాలందించు
నీ అధరామృతాలను సొక్కిన
వెదురు కొమ్మ కారాదా
నా ఉనికి, నీ తీయని పాటగా మారి
తరియించరాదా ?
నీకై సదా తృష్ణతో నిలిచిన
ఈ భక్తురాలి ఆవేదనలు
కారాదా వెదురుపై గాయాలు
సుస్వర ఝరి నందిస్తూ
జీవన సాఫల్యాముగా
ఈ నీరస హృదయవేదన దూరం చేస్తూ...
2 comments:
చాలా బాగా రాసారు....
ధన్యవాదాలు అనూ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి