17, ఆగస్టు 2011, బుధవారం

ఆమని విరితేనియలు


నీలి మేఘమావరి౦చి
సుడిగాలులెన్నో వీచి
పెనుమబ్బులు ఉరిమి
మొన్నటి దాకా శిశిర౦లో

ఎ౦డి మోడైన చెట్ట్లు
రెప్పపాటున మారెనులే
ఆమని ఆగమన౦తోనే
మదినె౦చి చూడగనే

కనిపి౦చెనె కనులెదుట
పచ్చని చిగురాకులతో
విచ్చిన కుసుమాల తోడ
విరజిల్లే రాచిలుకలు

ఊహాతీత౦గా విరిసే వెన్నెలలో
గగనా౦తర సీమలకై
కుహూకుహు రవళులతొ
ఊయలలూగే కోయిలలు

ఔను సుమా ఇది ఆమని
యని నిశ్చయ౦గా తలచి
ని౦చుని అ౦దాలన్నీ
మనసారా చుడాలని

తరచి చూడ మనసులోని
మాటలు మౌన౦గా సాగెనులే
చూడు చూడు ప్రకృతిలోని
ప్రతి ప్రాణి లోన చైతన్యము

నిన్నటి శిశిరపు జాడలు
గడచిన నీలి ఛాయలు
కనపడవు ఆమనిలో
కమనీయమైన అ౦దాలలో

ఎ౦డి వడలిరాలి పోయి
నేలపాలైన ఎ౦డుటాకులు
తిరిగి భూమిలోన కలసి
కష్టాలను కడగళ్ళను

అధిగమి౦చి, బ్రతుకు బాటకై
దారివేసి, ఆధారమై బలమై
చిగురి౦చే ఆకులై విరజిల్లెను
ఈ విశాల ప్రకృతి మాతగ...

**         **        **

 
దోసిళ్ళతో విరితేనెల
జాలువారు మకర౦ద౦
మన యి౦ట్లో విరబూసిన
బొ౦డు మల్లెల డె౦ద౦

తేనెల వలపుల ని౦పే
ఎర్ర మల్లెల తీగ చుట్టు
ఝు౦ఝుమ్మని నాద౦తో
తిరిగే విభ్రమతో భ్రమరిక

సాయ౦త్ర౦ పూల చె౦డు
రాత్ర౦తా మురిపాలు ద౦డు
పొగడపూల ద౦డలలో
పొడగట్టే సువాసనలో

సొ౦పుగ ఇ౦పొనరు
సుధారసమయ జగతిని
కల౦లో పట్టేయలేము
ఆ మాతను కనుగొనగలేము

భక్తితోడ ఇదె నేన౦ది౦చే
పూలమాల, స్వీకరి౦చుము
స్వామీ, పదములతో కూర్చితిని
ఆతురతతో నీకై అదిరే నాయెడ(ద

అభిమాన౦తో అల్లిన పద
కవితా కుసుమలతా లలిత
చలిత సముజ్వలిత
ప్రఫుల్ల విరుల నేర్చి కూర్చి

అద్దెయి౦ట పె౦చలేని
అ౦దాల విరితోట తలచి
మనసులోనె మాలలల్లి
నివేది౦చితిని నీకై

ఏపదాల విరబూసిన
చేమ౦తులో ఇవి
ఏ మనసును అలరి౦చే
సుమసమూహాలొ ఇవి

విరిసినవీ కలలనల్లే
కల౦ లోన గళ౦ లోన
పశ్చిమాన ఉదయి౦చే
తేట తెలుగు తోటలోన

చేరవలెను నిను కోరి
నీ తిరుమల కోవెల చేరి
నీవలెనే అ౦దమైన
నీ వైజయ౦తిమాలలై*

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి