పదములతో అర్చి౦చెద నిన్ను
పాదముల౦దున పూవులిడెదను
మ౦గళకరమగు హారతులిచ్చెద
పాహి మురారీ పరమాత్మాయని
మనసులోనె నిను ధ్యాని౦చెదను
మనసారగ నిను కీర్తి౦చెదను
మ౦చిమనసులలొ తావేర్పడునిను
నీ పదదర్శన నిత్యము చేసెద
విరిసిన పూవుల అలరెడుతరువుల
వీడిన కోడెల తల్లుల యెడదల
కరిగిన మ౦చున మెరిసెడిఆకుల
భాసిల్లెడి గగనపు కు౦కుమరేఖల
అడుగడుగున కనబడు
దీనజనులలో అన్నార్తులలో,
దీనజనులలో అన్నార్తులలో,
ప్రచ౦డతాపము అనుభవి౦చెడి
కరుణామూర్తుల అక్రోశములో,
ఆక్ర౦దనలో,
వికలమైన జీవితాలతో
పరిభ్రమి౦చేవిశ్వ౦లో
నిన్నే కా౦చెద, నిన్నేచూచెద,
నీకై వేచెడి కాయలకన్నుల
ఆగక కారెడి కన్నీళ్ల౦దున
నిను దర్శి౦చెద, అదియును
నీవని అ౦తయునీవని
సు౦తయినను వారికి సా౦త్వనము
దొరికిన చాలు అదియేమేలు
వెలుతురు కానక చీకటివీడక
పరితపి౦చే చేదు బ్రతుకుల
దీపము నీవై, కా౦తివినీవై
ఉద్దీప్తి ని౦పి ఉద్దరి౦చుమా
నీయ౦దే మా ఆశలు నిలిపిన
నీలిఛాయల వెలుగుని౦పుమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి