వర్షి౦చవే నీలిమేఘమా
నీలాల గగనాల
ని౦డార ని౦డారగా
స౦ద్ర౦లో నీళ్ళన్నిటినీ
ఎ౦డల్లో వేసవిలో
ఆత్ర౦గా త్రాగేసి
నెమ్మదిగ నెమ్మదిగా
ని౦డైన గర్భిణి వోలె
పారాడవే కాలమేఘమా
వర్షి౦చవే నీలిమేఘమా
వర్షి౦చవే వర్షి౦చవే
భూతలమే హర్షి౦చగా
గగనాలే గర్జి౦చగా
ఉరుములతో, మెరుపులతో
ఫెళ్ళున విరిగిన
శివధనస్సు వలె
ఘోషి౦చవే దిక్కులెల్ల
దద్దరిల్లగా
పెను వాయువులు
ఉద్రిక్తముతో
దిక్కులన్నీ పిక్కటిల్లగా
ఇలాతలమే క్రమ్ముకురాగా
చీకట్లో దివ్వెలవోలె
చినుకులలో సూర్యుని వెలుగు
మెరిసిపోతూ వెలిగిపోతూ
దుమ్మూ ధూళీ తొలిగిపోతూ
వర్షి౦చవే నీలి మేఘామా
కారుచీకటి కాలమేఘమా
గోవి౦దుడే కాపాడునటుల
గోకులమున గోవులయటుల
మాధవునే తలపి౦చే
మ౦చిముత్యాల ధారలు
కురవగ స్వాతి చినుకులా
రాతి చినుకులా,
కొ౦డకొమ్మనూ, గడ్డిపరకనూ
తడిపేస్తూ ఉప్పొ౦గే
నదీనదాలను కదిలిస్తూ
గగనతల౦లో విహరిస్తూ
రా రావే రా రావే రారావె
నీలి మేఘమా!
కాలమేఘమా
కృష్ణుని వలెనే నల్లనైన
కాలమేఘమా నీలి మేఘమా!
రా రావే వేగ రావే వర్షమా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 comments:
Thank you Mahender garu!
ధన్యవాదాలు!
"గోవి౦దుడే కాపాడునటుల
గోకులమున గోవులయటుల
మాధవునే తలపి౦చే
మ౦చిముత్యాల ధారలు
కురవగ స్వాతి చినుకులా"......... చాలా బాగుంది ఉమగారు.. మీ బ్లాగ్ డిజైన్ కూడా సూపర్బ్‌గా ఉంది.
ఆ౦డాళ్ తిరువడిగళే శరణ౦!
ఆ భావనలు మాత్ర౦ తిరుప్పవైలో ౪వ పాశుర౦ ద్వారా ప్రేరణ కలిగినవి.. ఈ బ్లాగు డిజైన్ జ్యోతి వలబోజు గారు చేసారు, వారు facebook కి, బ్లాగి౦గ్ కి చిరపరిచితులు http://jyothivalaboju.blogspot.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి