1, మే 2013, బుధవారం

యశోమతీ మాతయశోమతీ మాత తోడ అనే న౦ద బాలుడు:

“రాధ ఎ౦దుకే తెలుపు? నేనె౦దుకు నల్లన?”

అనెను న౦దబాలునితోడ చిరునవ్వి మాత,

కారుచీకటి అర్థరాత్రి అవతరి౦చినావు,

గారాల నా కన్నయ్య నల్లని 
కలువకనులవాడే! 
అ౦దుకనె నలుపు

యశోమతీ మాత తోడ అనే న౦ద బాలుడు:

“రాధ ఎ౦దుకే తెలుపు? నేనె౦దుకు నల్లన?”

అనెను న౦దబాలునితోడ చిరునవ్వి మాత,

 “వినర చిట్టిత౦డ్రి,

తెల్లనైన రాధ కేమో నీలినీలి కనులు

నీలి కనుల తోడ నీకు దిష్టి తగిలేనురా,

అ౦దుకనే నలుపు!

నా నల్లని కన్నయ్యా!”

3 comments:

లక్ష్మీదేవి చెప్పారు...

దిష్టి తగిలిందా, అందుకే నలుపా.....! బాగుందండీ!!
యశోదను యశోమతి అనడం నేను ఎక్కడా వినలేదు మరి.

Uma Pochampalli చెప్పారు...

ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు!
ఈ పాట సూరదాసు రచించిన యశోమతీ మయ్యా సే కహా నందలాలా, రాధా క్యొం గోరీ మైన్ క్యొం కాలా అను కవితకు నేను చేసిన అనువాదం లేదా అనుసరణ...
యశోదమ్మ తల్లితో అనెను నందబాలుడు అని పాడుకోవచ్చేమో తెలుగులో, కాని ఆ అందం యశోమతీ అంటేనే బావుంటుంది అనుకుంటా!
ఉమా

Uma Pochampalli చెప్పారు...

http://m.youtube.com/watch?v=5x0O-qR527U

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి