యెద లో ఏవో భావనలు
కదిలే నదిలా నీ ఊహలు
ఊహలఊయలలో హొయలు
కథలా సాగెను రాగాలు!
ఈ యెదలో మాటల ఊటలు
శతకోటి మేటి సరసరాగాలైన
బ్రతుకొక తీరని యాగము
తేనియల తెలుగొక మోహము!
కవితల జాడలలో కానమని
సుకవితాగానం లహరించి
కొనగోటను మీటిన వీణవలె
రాగాలరవళుల నందించి
సాహితీ సుమాలనేర్చికూర్చి
పేర్చిన పగడాల మణులలో
ప్రవహించునదే ప్రేమమూర్తి
సువిశాల సుందర రసమయ
లయభరిత జయజనిత శ్రీకృత
అమిత రమిత సుకవితా సారసవాహిని
తకధిమితథిమిత తత్కావ్యకుసుమలతా
పరాగరంజిత వాణి చరణముల కిదే
గద్గదిత విభ్రమిత భ్రమిత హృదయాంజలి..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి